నారాయణపేట జిల్లా మక్తల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతుందని ఆయన ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచడం, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ వల్ల ఎక్కువ శాతం మనమే నష్టపోతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తెరాస పార్టీ సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని.. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రతీ ఒక్క పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ సభ్యులు దేవరి మల్లప్ప, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషా, మార్కెట్ ఛైర్మన్ రాజేశ్ గౌడ్, మైపాల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం