ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత... బైకు సీజ్​

నారాయణపేట జిల్లా కోటకొండక గ్రామశివారులో టాస్క్​ఫోర్స్​ అధికారులు తనిఖీలు చేపట్టగా రూ. 24 వేల విలువైన అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి​ సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై బాలయ్య వివరించారు.

illegal-gutka-caught-by-police-at-narayanpet
అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత... బైకు సీజ్​
author img

By

Published : Jul 3, 2020, 8:10 PM IST

Updated : Jul 3, 2020, 8:15 PM IST

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండక గ్రామశివారులో ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. కథల్​భీం గౌడ్​ అనే వ్యక్తి యాక్టీవా స్కూటీపై పేరపళ్ల నుంచి కోటకొండకు వెళ్తున్నాడు. దారిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు అతని బైకును సోదా చేశారు. రూ. 24 వేల విలువైన ప్రభుత్వ నిషేధిత అంబార్ జర్దా, గుట్కా ఉన్న మూడు సంచులను స్వాధీనం చేసుకున్నారు.

కథల్​భీంపై కేసు నమోదు చేసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్​ చేసినట్లు ఏఎస్సై బాలయ్య వివరించారు. ప్రభుత్వం నిషేధించి గుట్కాలను ఎవరైన అమ్మినా, కొనుగోలు చేసినా, ఇతర ప్రదేశాలకు తరలించినా... వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్సై హెచ్చరించారు.

Last Updated : Jul 3, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.