నారాయణపేట జిల్లా కేంద్రంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డు ప్రారంభించి తిరిగి వెళ్తున్న క్రమంలో కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కాన్వాయ్ ముందు బైఠాయించి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నారాయణపేటకు పీజీ కళాశాల మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని నినాదాలు చేశారు.
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు.... ఆందోళనకారులను చెదరగొట్టారు. విద్యార్థి నాయకులపై లాఠీ ఝుళిపించారు. వారిని అరెస్ట్ చేసి... పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నారాయణపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. సమీకృత మార్కెట్, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Land Grabbing : నకిలీ సేల్ డీడ్లు.. డబుల్ రిజిస్ట్రేషన్లతో భూకబ్జాలు