నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో తెల్లవారుజామున హెచ్‌పీ పెట్రోల్ బంకు నుంచి దొంగలు 1,200 లీటర్ల డీజిల్‌ను తస్కరించారు. సమీపంలో ఉన్న మూతపడిన భారత్ పెట్రోల్ బంకును అడ్డాగా మార్చుకున్న దుండగులు... బంకు సిబ్బంది గాఢనిద్రలో ఉన్న సమయంలో డీజిల్ ట్యాంక్ వెనకభాగంలో మూతను బద్దలుకొట్టి ఇంధనాన్ని దొంగిలించారు.
వాహనాల్లో దొంగిలించిన డీజిల్‌ను తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. దుండగులు పారిపోతూ పాత పెట్రోల్ బంకు యంత్రాన్ని ఢీకొట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి దొంగతనాలు మక్తల్, మరికల్, దేవరకద్ర పరిసర ప్రాంతాలలో తరచుగా జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చదవండి: గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!