ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస డబ్బులతో గెలవాలని చూస్తోంది'

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యువతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ పార్టీ నుంచి చైతన్యవంతురాలు రాణీ రుద్రమ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

yuva Telangana party election campaign
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస డబ్బులు చల్లి గెలవాలని చూస్తోంది'
author img

By

Published : Oct 6, 2020, 9:44 AM IST

దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల దోపీడీ నినాదంతో పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వివక్ష చూపిస్తున్నారన్నారు. కనీసం ఎమ్మెల్యేలు నోర్లు తెరవడం లేదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస డబ్బులు చల్లి గెలవాలని చూస్తోందని ఆరోపించారు.

తమ పార్టీ నుంచి చైతన్యవంతురాలు రాణీ రుద్రమ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నారని ప్రకటించారు. ఆమెను ఆశ్వీరదించి శాసనమండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు రాణీ రుద్రమ మాట్లాడుతూ పాలకులు చేస్తున్న అన్యాయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటున్న యువతకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జులు సాయిబాబా, బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.