నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంప సాగర్ విజ్ఞాన కేంద్రంలో మహిళలు చిరుధాన్యలతో బేకరీ ఉత్తత్పులను తయారు చేయడంలో శిక్షణ పొందారు. సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు మొదలైన చిరుధాన్యాలతో బేకరీ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.
దాదాపు 40 మంది మహిళలకు ఐదు రోజుల పాటు బేకరీ ఉత్పత్తుల తయారీలో మెళుకువలు నేర్పించారు. రాగి లడ్డు, రాగి జంతికలు, రాగి గవ్వలు, రాగి బిస్కెట్లు, రాగి కేక్, జొన్న స్వీట్, కొర్ర పాయసం, బిస్కెట్స్, పలు రకాల ఉత్పత్తుల తయారీలలో శిక్షణ పొందారు మహిళలు.
చిరుధాన్యాల తింటే పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుంది. మహిళల సంఘటిత శక్తి.. వారికిప్పుడు ఆదాయవనరుగా మారింది. ఇటీవల కాలంలో చిరు ధాన్యాలకు గిరాకీ పెరగడం.. వీరి ఆదాయాన్ని పెంచుతోంది.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ యాప్లో కొత్త ఫీచర్స్