Vidya Project at Miryalaguda in Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన దీరావత్ శ్రీనివాస్ నాయక్ పట్టణంలో నివాసం ఉంటూ అక్కడే ఫెయితు బంజారా అనాధాశ్రమం నిర్వహిస్తున్న హన్యా నాయక్, రమా భాయి దంపతుల కుమారుడు. తన తండ్రి పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన తరువాత కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అదే బాటలో శ్రీనివాస్ నాయక్ నడుస్తున్నాడు. శ్రీనివాస్ నాయక్ యూరప్‌లోని ఏథెన్స్లో ఎంబీఏ చేశాడు. తన తండ్రి 2000 సంత్సరంలో ఫెయితు బంజారా అనాధాశ్రమం స్థాపించి సేవలు అందించడంతో శ్రీనివాస్ నాయక్ 2013 నుంచి అందులో భాగస్వామి అయ్యాడు. కరోనా తర్వాత విద్యా ప్రాజెక్ట్ పాఠశాలను ఏర్పాటు చేశాడు.
Young Man Giving Free Education in Miryalaguda : యువకుడికి తెలిసిన మిత్రుల ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలను గుర్తించి వారికి త్రిపురారం మండల కేంద్రంలో ఒక పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో విద్యా ప్రాజెక్ట్(Vidya Project)ను 2021లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మందికి విద్యను అందిస్తున్నారు. ఈ విద్యా ప్రాజెక్ట్‌లో తనకు సాయంగా.. వాలంటీరులకు కొద్ది పాటి జీతాలు ఇస్తూ ఉపాధిని అందిస్తున్నాడు. ఈ విద్యా ప్రాజెక్ట్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తూ, దాతల సహకారంతో విద్యార్థులకు పోషకారం కూడా అందజేస్తున్నారు. విద్యా దానం(Free Education) చేస్తున్నందుకు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో డిఫెన్స్ మేనేజర్ సంజయ్ చేతుల మీదుగా ఏషియన్ ఎడ్యుకేషన్ అవార్డు అందుకున్నాడు. ఇలానే చాలా అవార్డులు పొందాడు.
తండాలో పుట్టాడు.. గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు
Donars Help to Vidya Project in Nalgonda : దాతల సహకారంతో విద్యార్థులకు డిజిటల్ తరగతులతో బోధన, ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. ఈ విద్యా ప్రాజెక్ట్‌ను దాతలు.. ప్రభుత్వం సహకారం అందిస్తే.. పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేసి మరింత మందికి విద్యాదానం చేయాలని ఉందని శ్రీనివాస్ నాయక్ తెలిపాడు. విద్య విలువ తెలిసిన వారికి అదెప్పుడూ అమృతమే. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అలాంటి విద్య పేదవారికి ఉచితంగా అందించే ప్రయత్నంతో అందరి అభినందనలు శ్రీనివాస్ పొందుతున్నాడు.
"ప్రతి పిల్లవాడు పాఠశాలకు వెళ్లాలి.. చదువుకోవాలి అనే లక్ష్యంతో ఈ విద్యా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాను. చుట్టుపక్కల ఉన్నపేద విద్యార్థులను మేమే గుర్తించి.. వారిని చదువుకునేలా చూస్తున్నాం. ఓ పాఠశాలను అద్దె భవనంలో నడుపుతున్నాం. ప్రస్తుతం 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాతలు సాయంతో విజయవంతంగా నడపగలుగుతున్నాం. మాకు ప్రభుత్వం మరింత సాయం చేయగలిగితే 1000 మంది విద్యార్థులను చదివించే విధంగా ప్రణాళికలు వేస్తున్నాం."-శ్రీనివాస్ నాయక్, విద్యాప్రాజెక్ట్ నిర్వాహకుడు
Kalari Training in Kodangal : కలరిపయట్టు.. మరచిపోతున్న కళను నేర్పిస్తున్న యువకుడు
Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'