నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ 44వ పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సన్‌షైన్ స్కూల్లో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 40 మంది పాల్గొని రక్తదానం చేశారు. తెరాస మండల పార్టీ ఆధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న ఆద్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. రక్తదానం చేయడమంటే.. మరొకరికి ప్రాణదానం చేయడమే అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు