తొలిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 39 మంది మహిళలు జూనియర్ లైన్‌మెన్లు(Women selected as Junior Linemen)గా ఎంపికయ్యారు. ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా 2017లో జేఎల్‌ఎంల(Junior Linemen) ఉద్యోగ ప్రకటనలో మహిళలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో రాతపరీక్ష నిర్వహించింది. తదుపరి కొందరూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు మహిళలకు కల్పించారు. ఈనెల 4, 5 తేదీల్లో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి 220 కేవీ పరిధిలో అభ్యర్ధులకు టవర్ ఎక్కే పరీక్ష నిర్వహించారు. అందులో 83 మంది అభ్యర్థులు ఎంపీకయ్యారు. వారిలో 39 మహిళలు జూనియర్ లైన్‌మెన్లుగా ఎంపికవడం విశేషం. వీరికి ఈనెల 12న ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ట్రాన్స్‌కో మాదిరిగానే ఇతర మధ్యప్రాంత, ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలో మహిళల(Women selected as Junior Linemen)కు అవకాశం కల్పించాలని డిమాండ్ వస్తుంది.
అనుకున్న లక్ష్యం సాధ్యం
![](https://assets.eenadu.net/article_img/nlg1b.jpg)
అమ్మానాన్న సహకారం భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించా. మా ఆయన శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు (జెన్‌కో) పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న డిపార్టుమెంటులోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేశా. నాకు ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు శస్త్రచికిత్స అయింది. విద్యుత్తు టవర్లు ఎక్కాలంటే భయం వేసింది. హైదరాబాద్ సమీపంలో షాద్‌నగర్ తిమ్మపూర్ వద్ద వారం రోజుల పాటు టవర్ ఎక్కేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఈనెల 4, 5 తేదీల్లో నార్కట్‌పల్లి వద్ద నిర్వహించిన టవర్ ఎక్కే పరీక్షలో నెగ్గి అనుకున్న లక్ష్యం సాధించా.
కృషికి తగ్గ ఫలితం
![](https://assets.eenadu.net/article_img/nlg1c.jpg)
ఈ ఉద్యోగం సాధించడానికి మా ఆయన సహకారం ఎంతో ఉంది. మా ఆయన జెన్‌కోలో ఫోర్‌మెన్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేను ఐటీఐ పూర్తి చేశాను. ఇంటి వద్దనే ఉండి పిల్లల ఆలన పాలన చూస్తున్నాను. 2013లో తొలిసారిగా జెన్‌లో జగమర్‌ప్లాంట్ ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం ఇవ్వడంతో నన్ను ప్రోత్సహించారు. 2017లో ట్రాన్స్‌కోలో ప్రకటించిన జేఎల్‌ఎంల పోస్టులకు దరఖాస్తు చేశారు. 2018లో నిర్వహించిన రాతపరీక్షల్లో ఉమ్మడి జిల్లా మూడో ర్యాంకు సాధించాను. ఇటీవల నిర్వహించిన టవర్ ఎక్కే పరీక్షలో విజయం సాధించారు. కృషికి తగ్గ ఫలితం లభించింది. ఈనెల 13న ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఇప్పుడు ఆనందంగా ఉంది. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. కానీ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
పట్టుదలతో టవర్ ఎక్కి..
![](https://assets.eenadu.net/article_img/nlg1d.jpg)
ట్రాన్స్‌కోలో ఉద్యోగం రావడం మా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. ఐటీఐ పూర్తి చేశా. మా ఆయన సూర్యాపేటలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరం పనిచేస్తేనే కుటుంబం ఆర్థికంగా బలపడుతోందనే లక్ష్యంతో 2017 ప్రభుత్వం జేఎల్‌ఎంల ఉద్యోగ ప్రకటన జారీ చేయడంతో దరఖాస్తు చేశాను. ఇన్నాళ్లు కోర్టు కేసులతో జాప్యం నెలకొంది. ఇటీవల నిర్వహించిన టవర్ ఎక్కే పరీక్షలో పట్టుదలతో ఎక్కి విజయం సాధించాం. జేఎల్‌ఎం ఉద్యోగం పొందడం సంతోషంగా ఉంది.
- ఇదీ చదవండి : కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!