నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. కోలా మహేష్ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. టీవీ, కూలర్, ఫ్రిడ్జ్‌తో సహా వస్తువులన్ని బూడిదయ్యాయి. వరలక్ష్మీ వ్రతం కావటం వల్ల ఇంట్లోని నగదు అంతా దేవుడి దగ్గర పెట్టగా అదీ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.15,000 నగదుతో కలిపి సుమారు రూ.లక్షన్నర ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు.
ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం