MLC Gutha Sukender Reddy Comments on BJP And Congress: భాజపా నేతలు రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు రైతుల సంక్షేమమే పరమావధన్నారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారనే భాజపా, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం ఎఫ్‌సీఐలోని నిల్వలు ఖాళీ చేయట్లేదన్న గుత్తా సుఖేందర్ రెడ్డి... మిల్లర్లు పంపే బియ్యాన్ని త్వరగా దిగుమతి చేయట్లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భాజపా నాయకుడు బండిసంజయ్‌కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా.. ? అని ప్రశ్నించారు. వారు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అని నల్గొండ పట్టణంలోని ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
'పసువు బోర్డు ఏమైంది?'
turmeric board: కేంద్రం ఎఫ్‌సీఐలోని బియ్యం నిల్వలు ఖాళీ చేయట్లేదన్న గుత్తా... మిల్లర్లు పంపే బియ్యాన్ని ఎఫ్‌సీఐ త్వరగా దిగుమతి చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలతో కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెప్పాలని కేంద్రం కుట్రలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ...పార్లమెంట్లో తెరాస ఎంపీలు ఆందోళనలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలేమైనవి? అని నిలదీశారు. తెరాస స్థానిక సంస్థల అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు.
భాజపా ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి సరిపడ నిధులు రాట్లేదు. యూపీఏ హయాంలో ఉన్న ఎన్నో పథకాలకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. కేంద్రం స్థానికసంస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు అపోహలకు పోవద్దు. రాష్ట్రాల అధికారాలను లాక్కోవడం కాదు.. ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. కేంద్రం చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవడానికే.. తెరాస నేతలపై బియ్యం రీసైక్లింగ్ ఆరోపణలు చేస్తున్నారు. కరోనా కారణంగా పట్టణాలు వదిలి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసేవారి సంఖ్య రెండేళ్లలో మరింత పెరిగింది.
-ఎమ్మెల్సీ, గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇదీ చదవండి: paddy procurement: నెలల తరబడి పడిగాపులే.. కర్షకులకు తప్పని కన్నీరు