కొవిడ్ నిబంధనల నడుమ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. తొమ్మిది, పదోతరగతి విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. సుమారు పది నెలల అనంతరం బడులు తెరుచుకున్నాయి.
తరగతి గదులను శానిటైజ్ చేశారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ కుర్చోబెట్టారు. విద్యార్థులంతా మాస్కులు ధరించి పాఠశాలకు వచ్చారు. తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో విద్యార్థులు బడిబాట పట్టారు. చాలా కాలం తర్వాత తమ స్నేహితులను కలుసుకోవడంపై విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..