ETV Bharat / state

క్వారీతో దినదినగండం

ఆ కాలనీ వాసులు రోజు బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటారు. పెద్ద పెద్ద బండరాళ్లు ఏ ఇంటి మీద ఎప్పుడు పడతాయో అన్న భయం. ఉదయం బయటకు పోలేరు. రాత్రి కంటి నిండా నిద్ర రాదు. పోనీ ఇదేమైనా సక్రమమా అంటే అదీ లేదు. 12 ఏళ్లుగా జరుగుతున్న ఈ తంతు...నల్గొండ జిల్లా గుమ్మడవల్లి గ్రామంలోని వెంకటేశ్వరకాలనీలో జరుగుతోంది.

author img

By

Published : Mar 1, 2019, 4:35 PM IST

క్వారీతో దినదినగండం
క్వారీతో దినదినగండం
సుమారు 32 ఏళ్ల క్రితం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలు ఊరికిరెండు కిలోమీటర్ల దూరంలో కాలనీ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి అతి సమీపంలో సర్వేనంబర్‌ 77లో ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా... 12 ఏళ్లుగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ పలుగు రాళ్లను తోడుకుని వెళ్తోంది.

ప్రతి క్షణం భయం:

ప్రారంభంలో కాలనీకి దూరంగా పనులు చేపట్టగా అంతగా సమస్యలు రాలేదు. ఇటీవల కాలనీకి అతి సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేసి అందులో నుంచి రాళ్లను తీసేందుకు పేలుళ్లు జరుపుతున్నారు. ఎక్కువ శక్తితో జరిగే పేలుళ్లతో... రాళ్లు ఎగిరి ఇళ్లపై పడుతున్నాయి.అంతేకాదు సమీపంలోని పొలాల్లో రాళ్లు పడి పంటను నాశనం చేస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటోందని వాపోతున్నారు.

క్వారీ తవ్వకాలతో తమకు ప్రమాదముందని అక్కడపేలుళ్లు జరపకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అసలు ఈ క్వారీకి అనుమతి లేకపోయినా కూడా వారు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ క్వారీ పేలుళ్లపై అధికారులు తక్షణం స్పందించాలని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:'మా పోరు మతాలకు అతీతం'

Intro:FILENAME: TG_KRN_01_31_SCHOOL_GODAKULI_STUDENTS_GAYALU_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని అంతర్గాం టి టి ఎస్ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్ శ్రీవాణి ఉన్నత పాఠశాలలో భవనం పై అంతస్తు పైకి ఎక్కి సైడ్ గోడకూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి వెంటనే పాఠశాల యాజమాన్యం గోడకూలి గాయాలైన విద్యార్థులను స్థానిక ప్రైవేట్ వైద్యుల చే ప్రథమ చికిత్స చేయించి అనంతరం గోదావరిఖని లోని సిగ్మా సూపర్ స్పేషాలిటి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తున్నారు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇంటర్వెల్ సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్న విద్యార్థులపై ఆకస్మికంగా ఇటుక పిల్లలు పడడంతో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళన చెందారు శివాని పాఠశాలలో గాయపడ్డ సుశాంత్ వివేక్ లు 6వ తరగతి చదువు తుండగా నవదీప్ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు గాయాలైన విద్యార్థులను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు ఇటుక పిల్లలు తల పై పడడంతో తీవ్ర గాయపడ్డారు విద్యార్థులను చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు కాగా పాఠశాలలో గోడకూలి గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్లక్ష్యంతోనే పాఠశాల గోడకూలి విద్యార్థుల గాయాలు కావడానికి పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు కాగా పాఠశాల యాజమాన్య మంత్రం విద్యార్థులకు పెద్ద ప్రమాదమేమీ లేదని పాఠశాల యాజమాన్యం అంటున్నారు ఏది ఏమైనా పాఠశాలలో నిర్వాహకులు నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు విద్యార్థుల పట్ల పాఠశాలలో కార్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు
బైట్: 1). రాజు , గాయపడ్డ విద్యార్థి తండ్రి అంతర్గాం

Body:ఞఞ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.