నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా రోగులకు అత్యవసర వైద్య సహాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పోలీసు, రెవెన్యూ శాఖలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా... గత రెండు రోజుల నుంచి ఆ శాఖ సిబ్బంది ప్రాంతీయ ఆసుపత్రి వద్ద పరీక్షల కోసం బారులు తీరారు. బుధవారం ఉదయం 11 గంటలైనా వైద్యులు, సిబ్బంది వార్డుకు రాకపోగా.. పరీక్షల కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఈటలతో మాట్లాడి ప్రాంతీయ ఆసుపత్రిలో 30 పడకల కరోనా పాజిటివ్ వార్డును ఏర్పాటు చేసి, ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. కానీ ఆ వార్డులో పనిచేసేందుకు వైద్య సిబ్బంది ముందుకు రాకపోవడం వల్ల.. అక్కడ చేరిన రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వైద్య సేవలు మెరుగుపరచాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు