ETV Bharat / state

తల్లిదండ్రుల 'తప్పు'టడుగులు... అనాథలుగా చిన్నారులు - parents wrong decision makes children life as a hell and make them orphan

వ్యక్తిగత స్వార్థం, క్షణికానందం కోసం కొందరు కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధాలతో తల్లిదండ్రుల తప్పుటడుగులు పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. అన్నెం పుణ్యం ఎరుగని ఆ పసిహృదయాలు ఏ దిక్కులేని అనాథలుగా మారుతున్నాయి. ఆ చిన్నారులు చేయని తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నారు.

parents wrong decision makes children life as a hell and make them orphan
author img

By

Published : Jul 12, 2019, 1:09 PM IST

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న సినీకవి అందెశ్రీ మాటలు ఉమ్మడి జిల్లాలో జరిగే సంఘటనలకు సరిపోలుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయిబజార్‌కు చెందిన ఓ మహిళ తన భర్త స్నేహితుడైన గుంటూరుకు చెందిన ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో ప్రియుడితో కలిసి భర్త గొంతునలిమి హత్య చేసింది. వీరికున్న ఇద్దరు పిల్లలు ప్రస్తుతం బంధువుల దగ్గర ఉంటున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం ప్రాంతానికి చెందిన సోమకేశవులు వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి ఆయన భార్య స్వాతి సొంతింట్లోనే ఈనెల 2న హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడం వల్ల వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తాజాగా శాలిగౌరారం మండలం చిత్తలూరులో ఈనెల 9న జరిగిన గుండెబోయిన మల్లేష్‌ హత్య వెనకాలావివాహేతర సంబంధమే ఉందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఇదే కోణంలో విచారణ చేస్తున్నారు.

పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్న స్పృహ లేకుండా.. అన్ని తెలిసీ తప్పుదారులను ఎంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లికి ముందే చదువుకునే వయసులో ప్రేమ సంబంధాలుండటం, అవి వివాహ అనంతరం సైతం కొనసాగుతుండటం ఈ హత్యలకు ప్రధాన కారణంగా నిపుణులు వెల్లడిస్తున్నారు. నల్గొండలో జరిగిన సోమకేశవులు హత్య ఇదే కోణంలో జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడి కావడం దీనికి బలాన్నిస్తోంది.

80 శాతం హత్యలు ఈ కారణాలతోనే

ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న హత్యల్లో 80 శాతం వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయని పోలీసు దస్త్రాలు చెబుతున్నాయి. మరో 15 శాతం భూ వివాదాలు, 5 శాతం ఇతర కారణాలుంటున్నాయి. హత్య చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ అదే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారిలో కొంత మార్పు, పశ్చాత్తాపం కనిపించేదని ఇప్పుడు అలాంటివేవీ లేకుండా తిరిగి యథాప్రకారం అవే నేరాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు ఈ హత్యలతో సంబంధం ఉన్నవారిని పోలీసులు జైలుకు పంపడం వల్ల పిల్లలు వీధిన పడుతున్నారు. అప్పటి వరకు కార్పొరేట్‌ పాఠశాలల్లో వేలకు వేలు కడుతూ చదువుతున్న వారి జీవితంలో ఈ ఘటనలు చీకటి నింపుతున్నాయి. చేయని తప్పునకు వారు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తోంది.

నేను అనే భావనతోనే దారుణం

ఆధునిక పోకడలతో మనం అనే భావన కంటే నేను, నాది అనే భావన ఎక్కువైంది. సొంత ఆనందం, స్వార్థం కోసం కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎంత దూరమైన వెళుతున్నారు. గతంలో తప్పుచేస్తే తనకు ఏదో కీడు జరుగుతుందనే భయం ఉండేది. ఇప్పుడు అలాంటివేవీ లేకుండా పోయాయి. సామాజిక మాధ్యమాలు సైతం ఈ తరహా ఘటనలు పెరగడానికి ఓ కారణమవుతున్నాయని మానసిక వైద్యులు డాక్టర్​ శివరామకృష్ణ తెలిపారు.

ఇదీ చూడండి : చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

NLG
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.