నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల, గిరిజన రైతుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన రైతు సంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నాగార్జున పేట తండా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వ్యవసాయ కార్మిక నాయకులు ఐలయ్య జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
గిరిజన భూములకు రైతు బంధు పథకం ప్రకటించాలని, వారి భూముల పట్టాలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిర్వాసిత గ్రామాల గిరిజనుల భూములకు సాగునీరు అందించాలని కోరారు.
గిరిజన తండాల మీదుగా ఈ రోజు ప్రారంభమైన పాదయాత్ర ఈ నెల 5 సాయంత్రానికల్లా హాలియాకి చేరుకుంటుందని తెలిపారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో రైతు సంఘం నాయకులు, నాగిరెడ్డి గిరిజన నాయకులు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి