నాగార్జున సాగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్ (Nomula Bhagat) శాసనసభ్యుడిగా (MLA) ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌తో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు భగత్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.
గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్య సమస్యలతో మరణించారు. దీనితో నాగార్జునసాగర్‌లో సాగర్‌లో ఉపఎన్నిక వచ్చింది. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్సింహయ్య తనయుడు భగత్.... కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డిపై 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రులు, అధికారులు భగత్‌కు శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు.
గత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 88 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, తెదేపా నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు పార్టీ మారడంతో తెరాస సంఖ్య 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. భాజపా నుంచి ఇద్దరు ఉన్నారు.
దుబ్బాక, హుజూర్నగర్ ఉపఎన్నికలు రావడంతో... దుబ్బాకలో తెరాస పరాజయం పొందగా... హుజూర్‌నగర్‌లో తెరాస విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది.
పార్టీ | స్థానాలు |
తెరాస | 104(103+1) |
ఎంఐఎం | 7 |
కాంగ్రెస్ | 6 |
భాజపా | 2 |
ఖాళీ | 1 |
ఇదీ చూడండి: సాగర్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం