ETV Bharat / state

ఎన్నికలు సజావుగాా నిర్వహిస్తాం: ఎస్పీ రంగనాథ్ - పురపాలక ఎన్నికలు

నల్గొండ జిల్లాలో జరిగే పురపాలక ఎన్నికలకు తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

sp
sp
author img

By

Published : Apr 27, 2021, 12:40 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ వార్డు, నకిరేకల్​లో జరిగే పురపాలక ఎన్నికలకు తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై 18 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. నకిరేకల్​లో పోలీసులు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో లైసెన్స్ ఉన్న ఆయుధాలను బైండోవర్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రానికి నిర్దేశించిన సరిహద్దు దగ్గర పోలింగ్ చిట్టీలు పంచే ఆయా పార్టీల కార్యకర్తలు టెంట్లు వేసుకుని భారీగా చేరడం కారణంగా గొడవలకు అవకాశం ఉంటుందన్నారు. ఇకనుంచి అటువంటి అవకాశం ఇవ్వమని ఎస్పీ తెలిపారు. ఐదుగురు కార్యకర్తలకు మించి ఉండనివ్వబోమని తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.