నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని గుంటిపల్లి, వేంపాడులో ప్రకృతి వనాలు ఏర్పాటు విధివిధానాలపై అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం త్రిపురారం మండలం కంపాసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, మొక్క నాటారు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు... రైతులకు అందించే విత్తనాలు, సలహాలు, సూచనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.