ETV Bharat / state

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్​ క్రస్ట్​ గేట్లకు మరమ్మతులు - nagarjuna sagar in nalgonda district

భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. కృష్ణా పరివాహకంలో భారీ వరదల దృష్ట్యా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ(Nagarjuna Sagar Dam)) అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు రబ్బర్‌ సీల్స్‌, గ్రీజింగ్‌, ఆయిల్‌ మార్చడం వంటి పనులను పూర్తి చేశారు.

లోక్​సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
లోక్​సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
author img

By

Published : Jul 27, 2021, 11:47 AM IST

మరమ్మతు పనులు

భారీ వరదలు తెలంగాణను ముంచెత్తాయి. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వచ్చే వరదలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని నిండు కుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండటం వల్ల ఆయా ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహకంలో భారీ వరదల దృష్ట్యా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ(Nagarjuna Sagar Dam)) అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు రబ్బర్‌ సీల్స్‌, గ్రీజింగ్‌, ఆయిల్‌ మార్చడం వంటి పనులను సోమవారం పూర్తి చేశారు.

ఇవీ చదవండి :

రెండు కంపెనీలతో మరమ్మతు పనులు..

ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar Dam) నీటిమట్టం 539 అడుగులు ఉంది. క్రస్ట్‌గేట్లకు నీళ్లు తాకాలంటే నీటిమట్టం 546 కనీసం అడుగులు ఉండాలి. శ్రీశైలం నుంచి నిలకడగా వరద వస్తుండటంతో రెండు, మూడు రోజుల్లో ఎన్‌ఎస్‌పీ నీటిమట్టం క్రస్ట్‌గేట్లను తాకే అవకాశముంది. గతంలో ప్రాజెక్టు నీటిమట్టం 550 అడుగులకు చేరగానే 26 క్రస్ట్‌గేట్లలో దాదాపు పదింటి నుంచి నీళ్లు లీకవుతుండేవి. మూడేళ్లుగా ఆటోమేషన్‌ ద్వారా గేట్లను ఎత్తి, దించుతున్నారు. గతేడాది ఎమర్జెన్సీ గేటు దెబ్బతినడంతో రూ.50 లక్షలతో కొత్తదాన్ని అమర్చారు. ఈ దఫా రెండు కంపెనీలు మరమ్మతులను నిర్వహిస్తున్నాయి.

ఇవీ చదవండి :

స్పిల్​వే పనులు సాగడం లేదు..

గేట్ల తర్వాత ప్రాజెక్టు(Nagarjuna Sagar Dam)లో కీలకమైన స్పిల్‌వే మరమ్మతులు సాగడం లేదు. క్రస్ట్‌గేట్ల నుంచి నీళ్లు నేరుగా స్పిల్‌వేను తాకి కాంక్రీట్‌ కొట్టుకుపోతోంది. వీటి మరమ్మతులకు రూ.17.5 కోట్లు అవసరమని ఎన్‌ఎస్‌పీ అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాలేదు. వరదలు భారీగా వస్తాయన్న అంచనాతో క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగిస్తే స్పిల్‌వే మరింత దెబ్బతినే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి :

స్పిల్​వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.