Munugode Bypoll Nominations: మునుగోడు ఉప ఎన్నికల్లో ఈరోజు మొత్తం 11 మంది 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మూడు సెట్లతో నామినేషన్ దాఖలు చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఒక సెట్ నామినేషన్‌ను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ దాఖలు చేశారు.
మరో తొమ్మిది మంది స్వతంత్రులు 12 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జగన్నాథ్‌రావుకు సమర్పించారు. దీంతో రెండు రోజుల్లో మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు అయింది. తొలిరోజు ఒక స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే. నామినేషన్లు వేసిన స్వతంత్రుల్లో చలిక చంద్రశేఖర్, నల్లపు నవీన్‌కుమార్, నికిల్‌రెడ్డి, కృష్ణంరాజు చిట్టిబోయిన, శ్రీకాంత్ సిలివేరు, బేరీ వెంకటేశ్, కంటే సాయన్న, ఉదారి మల్లేశ్, క్రిష్ణ వరికుప్పల ఉన్నారు.
మరోవైపు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారమే నామినేషన్ వేస్తారని ప్రకటించినా.. చివరి నిమిషంలో దానిని 13 తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు మిత్రపక్షాలు సీపీఎం, సీపీఐలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెరాస అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి భారీ ఎత్తున ఈ నెల 14న నామినేషన్ వేయనున్నారు.
ఇవీ చదవండి: మోదీ, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది: రేవంత్ రెడ్డి
సుప్రీంలో సంచలనం.. కొలీజియంలో తొలిసారి అలా.. కొత్త సీజేఐ వచ్చాకే ఏదైనా..