ETV Bharat / state

నల్గొండ నా గుండెకాయ.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తా: కోమటిరెడ్డి - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పుట్టినరోజు సంబరాలు

MP Komati reddy Venkat reddy birthday celebrations: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. కోమటిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నల్గొండతో తనకున్న అనుబంధాన్ని కోమటిరెడ్డి గుర్తు చేసుకున్నారు.

mp komati reddy venkat reddy birthday celebrations
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి జన్మదిన వేడుకలు
author img

By

Published : May 23, 2022, 4:23 PM IST

MP Komati reddy Venkat reddy birthday celebrations: నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోమటిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు. వేడుకలకు పలు నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు తరలివచ్చారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ తన గుండెకాయ అని.. ఇక్కడి ప్రజలు తనకి 20 ఏళ్లు రాజకీయ జీవితం ప్రసాదించారని భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

"భువనగిరి ప్రజలు నన్ను గెలిపించి పార్లమెంట్‌కు పంపారు. ఏ జన్మ బంధమో నల్గొండ, భువనగిరి ప్రజలు వెన్నంటే ఉన్నారు. పిల్లల ప్రాణ త్యాగాలు చూడలేక మంత్రి పదవి వదులుకున్నా. తెలంగాణ కోసం సోనియాగాంధీతోనూ కొట్లాడాను."

-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

ఇవీ చదవండి: 'అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!'

భారత్​, అమెరికా సహా 12 దేశాల మధ్య 'ఇండో- పసిఫిక్​ ట్రేడ్​ డీల్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.