నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్లో మిషన్ భగీరథలో భాగంగా నల్లాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముఖ్యఅతిథిగా హాజరై నల్లాను ప్రారంభించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పురపాలక పరిధిలోని అన్ని ఇళ్లకు మిషన్ భగీరథ నల్లాలను పెట్టిస్తామని, పురపాలక అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని నోముల అన్నారు.
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు