నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కమలా నెహ్రు ఏరియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. దవాఖానాలో ఉన్న సౌకర్యాలు, ఇంకా కావల్సిన వసతులపై వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రంలో 80 పడకలతో ఆక్సిజన్ ఎప్పడు అందుబాటులోకి వస్తుందని ప్రశ్నించారు.
కరోనా పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇతర ఓపీ సేవలపై మంత్రి ఆరా తీశారు. అవసరం అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే వైద్య సిబ్బందికి సాగర్‌లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమలగిరి మండల జడ్పీటీసీ సూర్యా బాష్యా భర్త ఇటీవల కరోనాతో మృతి చెందగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి పరామర్శించారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం