ETV Bharat / state

సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్​రెడ్డి - సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్​రెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నికను తెరాస నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 10న సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండలం నెల్లికల్​ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్​రెడ్డి పరిశీలించారు.

Minister Jagadish Reddy reviewed the arrangements for the CM's meeting in nalgonda district
అధికారులతో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి
author img

By

Published : Feb 6, 2021, 7:03 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను రాష్ట్రమంత్రి జగదీశ్​ రెడ్డి పరిశీలించారు. నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలం నెల్లికల్ గ్రామంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన ఏర్పాట్లు, సాగర్ బీసీ పాఠశాలలో హెలిప్యాడ్ స్థలాలను సందర్శించారు. అనుముల మండలంలో భారీ బహిరంగసభ పనులను జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన పరిశీలించారు.

సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. జిల్లాలో బీడు భూములకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సభలో సీఎం జిల్లాకు పలు వరాలను ప్రకటిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి : అటవీశాఖపై సమర శంఖారావానికి రేగా పిలుపు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.