కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board news) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న నాగార్జునసాగర్‌లో పర్యటించిన ఉపసంఘం (KRMB Subcommittee news).. నేడు కూడా పర్యటిచనుంది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం.. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయాన్ని పరిశీలించింది. సాగర్ పరిధిలోని కంపోనెంట్ల క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును సభ్యులు సందర్శించారు. బీఆర్కే పిళ్లై ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు... తొలుత పెద్దఆడిశర్లపల్లి మండలంలోని పుట్టంగండి చేరుకున్నారు. అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి సిస్టర్న్, పుట్టంగండి పంప్‌హౌజ్‌ల పనితీరు గురించి... స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో జెన్కోతో పాటు... నీటిపారుదల విభాగాల కార్యకలాపాలపై ఇంజినీర్లను వివరాలు అడిగారు.
పుట్టంగండి పరిశీలన అనంతరం కేఆర్ఎంబీ సభ్యులు... వరద కాల్వ, సాగర్ ప్రధాన డ్యామ్, కుడి కాల్వ, కుడి కాల్వపై గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. సోమవారం డ్యామ్ పరిశీలించగా... నేడు మరోసారి ఆనకట్టను సందర్శించనున్నట్లు సాగర్ ఎస్ఈ ధర్మ తెలిపారు. నేడు సాగర్ జలాశయం స్పిల్‌వే, క్రస్ట్ గేట్లను సాగర్ ఎడమ కాల్వను అక్కడ ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించనున్నారు. భోజన అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
పోలవరంపై కేంద్రం సమీక్ష ఎప్పుడు?
ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన, సత్వర సాగునీటి ప్రయోజన పథకం, ఆయకట్టు అభివృద్ధి-నీటి నిర్వహణ కార్యక్రమం పథకాల కింద రూ.500 కోట్లకు పైగా నిధులతో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఈనెల 23న దిల్లీలో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. శ్రమశక్తి భవన్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనులపై చర్చించనున్నట్లు గురువారం జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర జల్‌శక్తి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన అవుట్లెట్లను సబ్‌కమిటీ పరిశీలించనుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లెట్లను పరిశీలించిన ఉపసంఘం.. తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని సబ్‌కమిటీ నాగార్జున సాగర్‌లో పర్యటిస్తోంది.
ఇదీ చూడండి: