ETV Bharat / state

ఉన్న ఇళ్లెన్ని.. వాటిల్లో గదులెన్ని? - corona precautions in nalgonda district

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు 11 లక్షల కుటుంబాలు ఉండగా.. అందులో సగం కుటుంబాలు ఒక్క గదిలోనే నివాసం ఉంటున్నాయి. కరోనా వైరస్‌ అంటువ్యాధి ఇయినందున ఇంటిలోని ఒకరు అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అంతా దానికి బాధితులు కావాల్సిందే. దీనిపై అప్రమత్తమైన ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు కుటుంబాల వారికి పల సూచనలు చేస్తోన్నారు.

how many members stay in home in old nalgonda district
ఉన్న ఇళ్లెన్ని.. వాటిల్లో గదులెన్ని?
author img

By

Published : Mar 29, 2020, 5:27 PM IST

కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉమ్మడి నల్లొండ జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సొంతిళ్లు ఉన్నవారు కేవలం 25 శాతం మందే. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో 11.02 లక్షల కుటుంబాలు ఉండగా.. అందులో సగం అంటే 5.1 లక్షల కుటుంబాలు ఒక్క గదిలోనే నివాసం ఉంటున్నాయి. కరోనా వైరస్‌ అంటువ్యాధి కావడంతో ఇంటిలోని ఒకరు అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అంతా దానికి బాధితులు కావాల్సిందే.

ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి జలుబు, దగ్గు వస్తే వారి నుంచి ఇతరులకు అంటుకోకుండా నివారించాలంటే అవి సోకిన వారిని ప్రత్యేక గదిలో వేరుగా ఉంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం ఉన్న కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో కేవలం 50 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. 7.5 లక్షల కుటుంబాల్లో ముగ్గురు కంటే ఎక్కువ జనాభా ఉన్నారు.

how many members stay in home in old nalgonda district
ఉన్న ఇళ్లెన్ని.. వాటిల్లో గదులెన్ని?

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ వేళ ప్రతి కుటుంబం తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఇంట్లోనే ఉండి... కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులకు తెలపాలని అధికారులు సూచిస్తున్నారు.

చిరు వ్యాపారుల ఇబ్బందులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దినసరి, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబానికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, రూ.1500 సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. డబ్బులు పేదల ఖాతాల్లో ఎలా జమచేయాలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రైతు బంధు పథకం కింద దాదాపుగా అందరి బ్యాంకు ఖాతాలు ప్రభుత్వం సేకరించిన దృష్ట్యా వాటిలోనే వేయాలా లేదా అనేది రెండ్రోజుల్లో తేలనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: పారిశుద్ధ్యమే పరమావధిగా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.