ETV Bharat / state

ఈదురు గాలుల బీభత్సం.. భారీగా ఆస్తి నష్టం

author img

By

Published : May 28, 2020, 4:46 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొండమల్లెపల్లి మండలంలో ఉన్న టీవీఎన్​ కాటన్​ మిల్లులో యంత్రాలు వర్షానికి తడవడం వల్ల 2కోట్ల 50లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాని వెల్లడించారు.

Heavy Wind rain at Devarakonda in Nalgonda district
ఈదురు గాలుల బీభత్సం... భారీగా ఆస్తి నష్టం

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దేవరకొండ, చింతపల్లి, కొండమల్లెపల్లిలో పలుచోట్ల చెట్లు విరిగి కరెంట్ వైర్లపై పడటం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి.

కొండమల్లెపల్లి మండలం కేశ్యా తండా వద్ద గల టీవీఎన్​ కాటన్ మిల్లులో వర్షానికి మిల్లులో యంత్రాలు పూర్తిగా తడిసిపోయాయి. దీనివల్ల రెండు కోట్ల యాబై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.