నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు రఘుపతి రెడ్డి తుది శ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన ఆయన్ని చికిత్స నిమిత్తం నల్గొండకు తరలిస్తుండగా కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. రఘుపతిరెడ్డికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఉరికంభం వరకు వెళ్లిన పోరాట వీరుడుగా నిలిచాడు. సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు కే.రామచంద్రారెడ్డి, కే.కృష్ణమూర్తి దళంలో ఆయన పనిచేశారు. 1951 జనవరి 21, 22న ఉరితీయాల్సిందిగా హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆ సమయంలో ఇంగ్లాండు న్యాయవాది డీఎన్ ప్రిట్ రఘుపతి రెడ్డి తరఫున వాధించారు. అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ను కలిసి పూర్తి వివరాలను తెలియజేసి ఉరిశిక్షను 14 గంటల ముందు రద్దు చేశారు. దానితో ఉరిశిక్ష నుంచి బయటపడి రఘపతి రెడ్డి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించారు.