మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ముందున్న మెకానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. రోజూలాగే గురువారం కూడా తాళం వేసి ఇంటికి వెళ్లాడు షాపు యజమాని. రాత్రి 11 గంటల సమయంలో మెకానిక్ షాపులోంచి పొగలు రావడం గమనించిన స్థానికులు షాపు దగ్గరకి వెళ్లి చుశారు. లోపల నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించి దుకాణం యజమానికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మెకానిక్ తాళాన్ని పగలగొట్టి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 9 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మెకానిక్ కంటతడి పెట్టుకున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు.
ఇవీ చూడండి: 'బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'