ETV Bharat / state

ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్​లు.. వాటి కోసం క్యూ లైన్​లు

కరోనా వేళ ఇదేం గోల... సన్నాలేసిన రైతు చతికిలపడ్డాడు.. దాన్ని అమ్ముకోడానికి నానా దారులు వెతుకుతున్నాడు. మొన్నటిదాకా మిల్లుల వద్ద... నేడు టోకెన్ల కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద... అన్నదాతకు అడుగడుగునా కష్టాలే. కనీస సౌకర్యాలు కూడా లేవని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

author img

By

Published : Nov 11, 2020, 4:55 PM IST

farmers que line for paddy selling tokens in miryalaguda
ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్​లు.. వాటి కోసం క్యూ లైన్​లు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధాన్యం టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. టోకెన్​ ఉంటే రైతులు ధాన్యం కొనుగోలు చేస్తున్నందున... రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. రద్దీ ఎక్కువ కావడం వల్ల తోపులాట జరిగి, మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులకు సరిపడా టోకెన్లు ముందే జారీ చేశామని చెబుతున్నారని... వారు ఇచ్చిన టోకెన్​లో ఏ తేదీ ఉంటే ఆ రోజే వరి కోయాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న టోకెన్​ పొందేందుకు ఈరోజు లైన్​లో నిలబడ్డవారికి చీటి ఇస్తున్నారని... మళ్లీ ఆ రోజు వచ్చి ఇదే విధంగా నిలబడాలని వాపోయారు.

వేచి చూస్తే ప్రమాదమే..

ఇన్ని రోజులు కాలయాపన చేస్తే తమ పంట పొలంలోనే తూరిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రైతులకు తహసీల్దార్​ కార్యాలయంలోనే టోకెన్​లు ఇవ్వనున్నందున... దూరప్రాంతాల వారి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సివస్తోందన్నారు. మహిళా రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. గ్రామాల వారీగా పంచుతామన్న అధికారులు అందరికీ ఒకే చోట ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆవేదన చెందుతున్నారు.

సన్నాల సాగుకు శిక్షా..?

ధాన్యం టోకెన్​ల పంపిణీలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతోందని రైతులు అంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి నిరీక్షిస్తున్నా... పట్టించుకున్న నాథుడే లేడని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఇంటి దగ్గరే పిల్లలను చూసుకునే వారు కూడా లేరని ఆవేదన చెందుతున్నారు. దారి ఖర్చులు కూడా భారంగా మారాయని వాపోతున్నారు. ఈ తోపులాటలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. సన్నాలు సాగు చేసినందుకు శిక్ష విధిస్తారా అని మండిపడుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నామని, ఏ ఒక్క నాయకుడు, అధికారి కానీ ఇటు వచ్చి చూసిన పాపాన పోలేదని ఆవేదన వెల్లగక్కుతున్నారు.

ఇదీ చూడండి: పెద్దపులి దాడిలో యువకుడు మృతి.. భయాందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.