నల్గొండ జిల్లా హాలియాలో శ్రీఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి హాజరయ్యారు. శివాజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను జానారెడ్డి ప్రారంభించారు. అభిమానుల కోరిక మేరకు కాసేపు క్రికెట్ బ్యాట్ పట్టి ఆలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యూత్ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులు రద్దు