పట్టణంలో రోజురోజుకీ పెరుగుతోన్న ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మిర్యాలగూడ డీఎస్పీ పి. శ్రీనివాస్ కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో చిరు వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా తోపుడు బండ్లు రహదారిపైనే ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని...వాటిని వేరే ప్రదేశాలకు తరలించడమే మార్గమన్నారు. నిర్వాహకులు కమిటీగా ఏర్పడి తమకు అనువైన ప్రదేశం చూపించాలని కోరారు. త్వరలో అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం