వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ అయ్యాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 11,799 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 15,817 ఓట్లు, కోదండరాం కు 19,335 ఓట్లు జమ అయ్యాయి.
ప్రస్తుతం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 23,432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,22,639 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 99,207 ఓట్లు, కోదండరాం కు 89,407 ఓట్లు వచ్చాయి. విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: సాగు 'సాగా'లంటే... రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం