ETV Bharat / state

Drinking Water Problem in Nalgonda : తాగునీటి కోసం నెల రోజులుగా నరకయాతన.. పట్టదా వారి ఆవేదన..

Drinking Water Problem in Thettekunta Nalgonda District : నెల రోజులుగా గుక్కెడు తాగు నీరు లేక గ్రామం మొత్తం అల్లాడిపోతోంది. రోడ్డు విస్తరణలో ఇంటి స్థలాలు కోల్పోయిన ముగ్గురు రైతులు పరిహారం కోసం పట్టుబట్టడం వల్ల.. అధికారులు తాగు నీరు నిలిపివేసి శిక్ష వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ప్రైవేట్ నీటి శుద్ధి కేంద్రాలు లేకపోవడం వల్ల.. తాగునీటి కోసం పక్క గ్రామాలకు వెళ్తున్న దయనీయ స్థితిపై ప్రత్యేక కథనం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 12:30 PM IST

Drinking Water Problem in Nalgonda తాగునీటి కోసం నెల రోజులుగా నరకయాతన పట్టదా వారి ఆవేదన..

Drinking Water Problem in Thettekunta Nalgonda District : నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో సుమారు 300 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఒకే ఒక్క ఓవర్‌హెడ్ ట్యాంకు ఉండగా.. అందులోకి మిషన్ భగీరథ నీరు చేరుతుంది. అక్కడ నుంచి గ్రామంలోకి తాగునీరు సరఫరా అవుతోంది. ఇటీవల వాటర్‌ ట్యాంక్‌ వాల్వ్‌కు ఇనుప గొలుసులు కట్టి సిబ్బంది తాళం వేశారు.

మిషన్ భగీరథకు లీకేజీ సమస్యలు.. జనానికి 'నీటి' సమస్యలు

నెల రోజులుగా గ్రామంలో తాగు నీరు రాక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. తాటికల్ పంచాయతీకి ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామానికి సర్పంచ్‌, వార్డు సభ్యులు, పాలకవర్గం లేదు. తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని గ్రామస్థులు వాపోతున్నారు. జాతీయ రహదారి 565 పనుల్లో భాగంగా తెట్టెకుంటకు చెందిన ముగ్గురు రైతులు ఇంటి స్థలాలు రోడ్డు విస్తరణలో కోల్పోయారు. దాని పరిహారం ఇప్పటివరకు వారికి అందలేదు.

Thettekunta People face Water Problems : తాగునీటి పాత పైపు లైన్‌ రోడ్డు విస్తరణలో కలిసిపోవడంతో కొత్తగా గొట్టపు మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులను రైతులు అడ్డుకుని పరిహారం సంగతి తేల్చాలని పట్టుబట్టారు. అధికారులు గేట్ వాల్వుకు తాళం వేసి తాగునీటిని నిలిపేశారు. గత్యంతరం లేక పక్కనున్న సూరారం, చందనవెల్లి గ్రామాల నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

గత నెల రోజులుగా మా గ్రామానికి తాగునీరు రావడం లేదు. ఊరికి మంచినీరు వచ్చే పైప్​లైన్​ వాల్వ్​కు తాళం వేశారు. రహదారి విస్తరణలో ఇంటి స్థలాలు కోల్పోయిన రైతులు.. పైప్​లైన్​ను అడ్డుకోవడంతో అధికారులు సమస్యను పరిష్కరించకుండా గ్రామానికి నీటి సరఫరాను ఆపేశారు. మాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చందనవెళ్లి, సూరారం గ్రామాల నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నాం. - గ్రామస్థులు

పాత పైపులైన్లకు లీకేజీల వల్ల నీరు కలుషితం అవుతుండటంతో సరఫరా నిలిపివేశామని మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు చెబుతున్నారు. 300 మీటర్ల మేర కొత్త పైపులైన్ నిర్మించాల్సి ఉందని.. రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల సమన్వయ లోపంతో నెల రోజులుగా తాగునీరుకు ఇబ్బందిపడుతున్నామని.. తక్షణం అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

"పాత పైప్​లైన్​కు లీకేజీ సమస్య రావడం వల్ల.. నీరు కలుషితమవుతుందని సరఫరాను ఆపేశాం. 300 మీటర్ల మేర కొత్త పైపులైన్ నిర్మించాల్సి ఉంది. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన రైతులు.. కొత్త పైప్​లైన్​ వేయడానికి అడ్డుపడుతున్నారు. సంబంధిత రోడ్డు విస్తరణ అధికారులు సమస్యను పరిష్కరించడం లేదు. వెంటనే రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం". - శ్రీను, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ

Mission Bhagiratha pipeline leakage in Lingapur : పైప్​లైన్​ లీకేజీతో.. మిషన్​భగీరథ ఉప్పొం'గంగ'

Roads Damaged in Jagtial : ఆ రోడ్లపై ప్రయాణమంటే.. నరకం చూడాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.