రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి పదేళ్లవుతోంది. ఆ సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రధాన కూడలిలో తెరాస ఆధ్వర్యంలో దీక్షా దివాస్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ ఆర్థిక సంస్థ ఛైర్మన్ పూజార్ల శంభయ్య పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు