సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి సమస్యాత్మకమైన గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో.. రహదారిపై స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించాయి.
17వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీల ప్రచారంతో పోటీ రసవత్తరంగా మారింది. తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. పలు పార్టీల కార్యకర్తల మధ్య.. తరచు ఘర్షణలు జరుగుతుండటంతో, మునుపెన్నడూ లేని రీతిలో భారీగా పోలీసులు మొహరించారు.
గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఆర్పీఎఫ్ బలగాలు హెచ్చరించాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపాయి.
ఇదీ చదవండి: ఉపఎన్నిక వేళ... వెక్కిరిస్తోన్న సమస్యల మేళా...