ETV Bharat / state

మిర్యాలగూడలో పెరిగిపోతున్న కరోనా కేసులు... భయాందోళనలో ప్రజలు

కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో 57 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ కొవిడ్​ ఉద్ధృతి పెరగటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

corona cases increasing in miryalaguda
corona cases increasing in miryalaguda
author img

By

Published : Jul 11, 2020, 10:22 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం పట్టణంలోనే సరాసరి 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం 57 కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.

బాధితుల్లో కొంత మంది హైదరాబాద్​లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో... మరికొంత మంది హోం క్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అధికారులు గతంలో తీసుకున్నంత శ్రద్ధ ఇప్పుడు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలనే కార్యాచరణను, అధికారులు, ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్లనే కరోనాను అరికట్టలేకపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.