నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఆర్టీసీ డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు ఆర్టీసీ సిబ్బంది నడుం బిగించారు. ఆర్టీసీ ద్వారా అందజేస్తున్న సేవలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. నార్కట్పల్లి డిపో మేనేజర్ నాగ మల్లాచారి ఆదేశాల మేరకు మోత్కూరు, నార్కట్పల్లి మార్గాల్లో బస్సులో ఎక్కిన ప్రయాణికులకు కండక్టర్లు కరపత్రాలను అందజేస్తూ ఆర్టీసీ ఔనత్యాన్ని వివరిస్తున్నారు.
ప్రయాణికులు తమ ప్రయాణానికి ప్రైవేటు వాహనాలను వెతుక్కోకుండా.. ఆర్టీసీలోనే ప్రయాణిస్తే ఆర్టీసీ బలోపేతం అవుతుందని ప్రయాణికులకు వివరిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ప్రయాణికులను కోరుతున్నారు.
ఇదీ చూడండి: '130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యం'