ETV Bharat / state

జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదు: గుత్తా - guttha sukender reddy comments on revanth reddy

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పెదాలపై సానుభూతి, కులాల పేర్లతో ఓట్లు తెచ్చుకోవడం ఆ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన నల్గొండలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

guttha sukhender reddy
గుత్తా సుఖేందర్​ రెడ్డి
author img

By

Published : Apr 15, 2021, 2:59 PM IST

Updated : Apr 15, 2021, 4:01 PM IST

హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్​.. నెల్లికల్ ప్రాజెక్ట్, కుంకుడు చెట్టు తండా ప్రాజెక్టులు మంజూరు చేయడం పట్ల శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందనీ.. ఏ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినా వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఛైర్మన్​ మీడియా సమావేశం నిర్వహించారు.

జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదు: గుత్తా

అందుకే స్పందించా..

జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశానని చెప్పుకోవడం.. ఆయన భిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారనడం హాస్యాస్పదంగా ఉందని గుత్తా అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో రేవంత్​ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. శాసన మండలి ఛైర్మన్​ హోదాలో ఉన్నప్పటికీ తనపై విమర్శలు చేస్తున్నారని.. అందుకే తాను స్పందించాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. జానారెడ్డి ఆయన ఇద్దరు కుమారులతోనే ఇబ్బందులు పడుతుంటే.. మళ్లీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పెద్ద కొడుకు, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి చిన్న కొడుకు అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీళ్లంతా కలిసి ఆయనను ముంచేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. సాగర్ ఉపఎన్నికల్లో ప్రజలు తెరాస గెలుపును కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'కనీసం 17 వేల మెజారిటీతో జానారెడ్డి విజయం సాధిస్తారు'

Last Updated : Apr 15, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.