నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రముఖుల రాకతో ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి గడువు దగ్గర పడుతుండగా ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పలు మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై పూలతో స్వాగతం పలికారు.
భాజపా అభ్యర్థి డాక్టర్ రవి కుమార్ను గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు. గుర్రంపోడు మండలంలోని మొదలైన రోడ్ షో చెపుర్, మోససంగి,వెల్మగూడెం గ్రామాల మీదుగా పెద్దవురా మండలానికి చేరుకుని ప్రచారంలో నిర్వహిస్తున్నారు.