నల్లగొండ జిల్లా దేవరకొండలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని చిన్నారులు, మహిళలు పోటీలో పాల్గొన్నారు.
ముగ్గులు వేయడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని గీతా మూర్తి అన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు.. నేడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలకు వెండి నాణేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, దేవరకొండ భాజపా వార్డు కౌన్సిలర్లు గాజుల మురళి, పులిజాల లక్ష్మీ, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం