నల్గొండ జిల్లా దేవరకొండలో భాజపా సభ్యత్వ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ ప్రజలు కుటుంబ పాలనకు చమరగీతం పాడారన్నారు. మిషన్ భగీరథ, కాకతీయలలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. తెలంగాణలో భాజపా ఎదుగుదలను ఓర్వలేక బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్నారని అరోపించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: "సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దు"