కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా డిమాండ్ చేసింది. పనులు లేక కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో మాస్టార్లు ఉన్నారని భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు నిరాహార దీక్ష చేపట్టారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం ఆవరణలో దీక్షకు దిగి.. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
ఇదీ చూడండి.. 'మీరు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే మాకు అంత లాభం'