నల్గొండ జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐదో రోజున జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అటుకుల బతుకమ్మను... తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందార వంటి పూలతో అందంగా పేర్చారు. అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి