ప్రజలకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి, సాగర్ ఉప ఎన్నికలో తెరాస గెలవాలని చూస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలోని లింగమంతుల స్వామి ఆలయాన్ని ఆ పార్టీ సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి రవికుమార్‌తో కలిసి సందర్శించారు. స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి మాయమాటలు చెప్పి సాగర్ ఎన్నికలో గెలవాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికలో తెరాసకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనరల్ స్థానంలో గిరిజన నాయకుడు రవికుమార్‌కు టికెట్ ఇచ్చి, భాజపా బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొక్కసారి నిరూపించుకుందన్నారు. ఇక్కడి యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని.. యాదవులను కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే చూస్తుందన్నారు. ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉండే రవికుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కళ్లల్లో భయం చూశా: విజయశాంతి