ETV Bharat / state

మూసీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 11 లారీలు, సుమో, ట్రాక్టర్​

author img

By

Published : Oct 15, 2020, 9:18 AM IST

మూసీకి మునుపెన్నడూ లేనంత భారీగా వరద వచ్చింది. మూసీ ప్రాజెక్టుకు తొలిసారిగా గరిష్ఠంగా 2.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. ఆ ప్రవాహానికి మూసీనదిలో 11 లారీలు, సుమో, ట్రాక్టర్​ కొట్టుకుపోయాయి.

11 lorries, sumo, tractor washed away by Musi flood waters in Yadadri District
మూసీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 11 లారీలు, సుమో, ట్రాక్టర్​

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిజాం హయాంలో కట్టిన మూసీ ప్రాజెక్టుకు తొలిసారిగా గరిష్ఠంగా 2.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వలిగొండ వద్ద ఉన్న బ్రిడ్జికి ఆనుకుని మూసీ నది ప్రవహిస్తుండడంతో నది ఒడ్డుపైన ఉన్న పదకొండు లారీలు, ఒక సుమో, ట్రాక్టర్‌ కొంత దూరం కొట్టుకుపోయాయి. 24 గంటల్లోనే అన్ని మండలాల్లో దాదాపు సగటున 15 సెం.మీ.లకు పైగా వర్షం పడటంతో అపార పంట నష్టం జరిగింది.

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ఎక్కా చెరువు అలుగుపోయడంతో కిందనే ఉన్న వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రెయిలింగ్‌ వద్ద కోతకు గురైంది. ఉమ్మడి వరంగల్‌ వర్షాలకు విలవిల్లాడుతోంది. ముఖ్యంగా జనగామ జిల్లాలో భారీగా రహదారులు, పంటలు దెబ్బతిన్నాయి. జనగామ పట్టణంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరంగల్‌ ఎన్టీఆర్‌ నగర్‌తోపాటు, పలు కాలనీలు జలమయమయ్యాయి.

మాటలకందని విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.