నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల తహసీల్దారు కార్యాలయంలో బాలాజీ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బాలాజీతో పాటు అతని కుమారుడు కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పని మీద కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి.. కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న సదరు ఉద్యోగి కుమారుడిని చూసి ప్రశ్నించగా.. అతడు దురుసుగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తిపై దుర్భాషలాడాడు. ఈ తతంగాన్నంతా ఆ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది.
ఘటనపై తహసీల్దార్ కృష్ణయ్య స్పందించారు. విచారణ జరిపి నివేదికను ఆర్డీవో కార్యాలయానికి పంపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.