నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ యల్. శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఎప్పటికప్పుడే మిల్లులకు తరలించాని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు పెట్టాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టార్పాలిన్లు, గున్ని బ్యాగులు తగినన్ని ఉన్నాయా లేవా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, ధాన్యం కొనుగోలు సజావుగానే కొనసాగుతున్నట్లు కొనుగోలు కేంద్ర సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. యజమానులతో ధాన్యం తరలింపు గురించి కలెక్టర్ మాట్లాడారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం