నల్లమల్ల ప్రాంతంలోని ప్రసిద్ది గాంచిన... 13వ శతాబ్ధానికి చెందిన కాకతీయుల ప్రతాపరుద్రుని కోటను పర్యాటక హబ్‌గా మార్చనున్నట్టు నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్ చౌహాన్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్‌తో కలిసి దాదాపు 280 అడుగుల ఎత్తైన కోట ప్రాంతానికి కాలినడకన చేరుకున్నారు. అచ్చంపేట నల్లమల్ల ముఖద్వారం మన్ననూర్ సమీపంలో గల ప్రతాపరుద్రుని కోటను క్షుణ్ణంగా పరిశీలించారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వనికి నివేదిక పంపినట్టు కలెక్టర్ తెలిపారు. కదిలివనం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు. నల్లమల్ల ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే సుందరమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దావూద్ మా దేశ పౌరుడు కాదు..!